నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న వరుణ్!

K V D Varma
Published on: 3 Nov 2019 8:26 PM IST
varun sandhesh
X
varun sandhesh

గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ ఫినాలే.. రసవత్తరంగా సాగుతోంది. ఫినాలేకి చేరిన ఐదుగురు కంటెస్టెంట్ లలో అలీ రెజా ఐదో స్థానంతో ఇప్పటికే బయటకు వచ్చేశారు. ఇక నాలుగో కంటెస్టెంట్ గా ఎవరు బయటకు వస్తారో తేల్చడానికి హీరో శ్రీకాంత్ వచ్చారు.

ఆయనను లోపలి పంపిస్తూ ఒక బ్రీఫ్ కేస్ చేతికి ఇచ్చారు. దానిలో ప్లాన్ ఎ ఉంది అన్నారు. ఇక హౌస్ లోకి వెళ్ళాక హౌస్ మేట్స్ అందరి మధ్యలో శ్రీకాంత్ కూచున్నారు. నాగార్జున ప్లాన్ ఎ చెప్పారు. శ్రీకాంత్ తీసుకు వచ్చిన బ్రీఫ్ కేసులో 10 లక్షల రూపాయలున్నాయి. ఆ డబ్బు తీసుకొని ఒకరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవచ్చని హౌస్ మేట్స్‌కి నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఎవరూ దానికి ఒప్పుకోలేదు.

ఇక ప్లాన్ బి..వరుణ్‌ను స్టోర్ రూంలోకి వెళ్లి ఇంకో బ్రీఫ్ కేస్ ఉంది తీసుకురమ్మన్నారు శ్రీకాంత్. అందులో మరో 10 లక్షలు ఉన్నాయి. మొత్తం 20 లక్షల రూపాయలు తీసుకొని ఒకరు బయటికి వచ్చేయొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ, ఎవ్వరూ దానికి సిద్ధమవలేదు.

తరువాత ప్లాన్ సీ ప్రకారం కేథరిన్ ఒక కవర్ తొ వచ్చారు. ఈ కవర్‌లో ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు ఉంది. ఈ సమయంలో కూడా 20 లక్షలు తీసుకొని ఒకరు బయటికి వెళ్లే అవకాశం ఇచ్చారు. అయినా, ఎవ్వరూ తీసుకోలేదు. దీంతో, శ్రీకాంత్ కవర్ ఓపెన్ చేసి వరుణ్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి ఆయనను బయటకు తీసుకు వచ్చారు.

K V D Varma

K V D Varma

Next Story