ప్రభాస్ కి ఐ లవ్ యూ చెబుతా అంటున్న వరలక్ష్మి

Ruthvik
Published on: 20 Feb 2019 6:01 PM IST
ప్రభాస్ కి ఐ లవ్ యూ చెబుతా అంటున్న వరలక్ష్మి
X

ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే హీరోయిన్లలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఒకరు. ఈ కోలీవుడ్ బ్యూటీ ఈ మధ్యనే మళ్లీ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం. తను ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే అది 'బాహుబలి' ప్రభాస్ కు మాత్రమే చెబుతానని చెప్పుకొచ్చింది ఈ భామ. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని స్పష్టం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఒక పక్క హీరోయిన్ క్యారెక్టర్లు మాత్రమే కాక మరోపక్క విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది వరలక్ష్మి.

ఈ మధ్యనే 'పందెంకోడి 2' సినిమాలో విలన్ గా నటించిన ఈమె ఆ సినిమా హీరో విశాల్ తో డేటింగ్లో ఉందంటూ వదంతులు బయటకు వచ్చాయి. అయితే విశాల్ కు అనీషా అనే వేరే అమ్మాయితో నిశ్చితార్థం కావడంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈ మధ్యనే ధనుష్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన 'మారి 2' సినిమాలో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో ప్రస్తుతం బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కనున్న తెలుగు సినిమా 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాలో కూడా వరలక్ష్మి ముఖ్య పాత్ర పోషిస్తోందని సమాచారం.

Ruthvik

Ruthvik

Next Story