మనోజ్ సినిమాని వైష్ణవ్ తేజ్ తీసుకున్నారా?

Vaishnav Tej: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో హీరోగా మారారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 1:30 PM IST
Vaishnav Tej With Manoj Movie Story
X

మనోజ్ సినిమాని వైష్ణవ్ తేజ్ తీసుకున్నారా?

Vaishnav Tej: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో హీరోగా మారారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇలా మొదటి సినిమాతోనే మంచి మర్చిపోలేని హిట్ అందుకున్నాడు ఈ మెగా హీరో.

ఇక ఈ మధ్యనే "కొండపొలం" సినిమాతో పర్వాలేదు అనిపించిన వైష్ణవ్ తేజ్ తాజాగా ఇప్పుడు "రంగ రంగ వైభవంగా" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తన నాలుగవ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. #పీవీటీ04 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్ లో ఇంటెన్స్ మాస్ అవతారంలో త్రిశూలం పట్టుకుని కనిపించాడు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గతంలో మంచు మనోజ్ "అహం బ్రహ్మాస్మి" అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పారు.

ఇక ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ అప్పుడు రామ్ చరణ్ స్వయంగా క్లాప్ కొట్టారు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. తాజాగా ఇప్పుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నారు. ఇక "అహంబ్రహ్మాస్మి" మరియు వైష్ణవ్ తేజ్ సినిమాల పోస్టర్లు రెండు కొంచెం ఒకేలా ఉండటంతో వైష్ణవ్ తేజ్ చేస్తున్న సినిమా "అహం బ్రహ్మాస్మి" సినిమానా అని అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ రెండు వేరు వేరు అయితే మనోజ్ తో సినిమా ఏమైందో ఇంకా తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story