తెలుగు రాష్ట్రాల్లో 'సై రా' తో సందడి చేయబోయేది వీళ్ళే

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'సై రా నరసింహ రెడ్డి'. భారత దేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 14 Jan 2019 1:04 PM IST
SyeRaa Narasimha Reddy
X
SyeRaa Narasimha Reddy

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'సై రా నరసింహ రెడ్డి'. భారత దేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమా విడుదల తేది ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం 'సై రా' విడుదల రైట్స్ ను యూవీ క్రియేషన్స్ బ్యానర్ బాగా పెద్ద మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది. ఇక 'సై రా' సినిమాను రామ్ చరణ్ సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే, అమితాబ్ బచ్చన్, సుదీప్ కిచ్చా, తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story