కంగనా కామెంట్ : ఊర్మిళ ట్వీట్‌!

Urmila Matondkar : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ లోని ప్రముఖులపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

Krishna
Updated on: 17 Nov 2020 10:45 AM IST
కంగనా కామెంట్ : ఊర్మిళ ట్వీట్‌!
X

Urmila Matondkar, kangana Ranaut

Urmila Matondkar : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ లోని ప్రముఖులపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో ఆమె వాఖ్యలు మరింత దుమారాన్ని లేపాయి.. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం పైన, శివసేన నాయకుల పైన తీవ్ర వాఖ్యలు చేశారు కంగనా.. అయితే కంగనాను ఉద్దేశిస్తూ నటి ఊర్మిళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీజేపీ టికెట్‌ పొందేందుకే కంగనా ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై నగరం పైన వివాదాస్పద వాఖ్యలు చేస్తుందని అన్నారు.

అయితే ఈ వాఖ్యాల పైన కంగనా స్పందించింది.. ఊర్మిళ కామెంట్లు నా పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే టికెట్‌ పొందడం నాకు అంతపెద్ద కష్టమేమీ కాదు.. అది వారికీ కూడా తెలుసు.. బీజేపీ టికెట్ కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాని ఆమె నా పైన ఆరోపణలు చేయడం దారుణం.. నటిగా కాకుండా కేవలం ఓ శృంగార తారగా మాత్రమే ఆమె ప్రజలకు సుపరిచితురాలైంది. అలాంటిది ఆమే టికెట్‌ పొందగలిగితే.. నేను ఎందుకు పొందలేను" అంటూ ఘాటుగా స్పందించింది..

ఈ వాఖ్యలు కొత్త చర్చకి దారీ తీశాయి.. అయితే కంగనా వాఖ్యాలకి ఊర్మిళ స్పందించింది. రియల్ పీపుల్ ఆఫ్ ఇండియా'కు.. పక్షపాతంలేని, గౌరవ ప్రదమైన మీడియాకు ధన్యవాదాలు. తప్పుడు విమర్శలు, ప్రచారానికి వ్యతిరేకంగా ఇది మీరు సాధించిన విజయం. మీ అభిమానం, ప్రేమ నా మనసును తాకాయి. జై హింద్‌' అంటూ ఊర్మిళ ట్వీట్ చేసింది.

Krishna

Krishna

Next Story