Upasana Konidela: ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్..

Upasana Konidela: ఉపాసన ఇంట విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 23 Jan 2023 11:54 AM IST
Upasana Konidela Grand Mother Passed Away
X

Upasana Konidela: ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్..

Upasana Konidela: ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను.. ఆమె నన్ను పెంచింది. నేను ఆమెను ఎప్పటికీ ప్రేమగా గుర్తుంచుకుంటాను. నా గ్రాండ్ పేరెంట్స్‌తో నేను అందుకున్న ప్రేమానుభవాలను నా పిల్లలకు కూడా అందేలా చూస్తానని మాటిస్తున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ అయింది. తన నానమ్మ పుష్ప తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది ఉపాస‌న‌. నెటిజ‌న్స్ , మెగా ఫ్యాన్స్ ఉపాస‌న‌కు సానుభూతిని తెలియ‌జేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story