శ్రీశైలంలో ఉపాసన సేవా కార్యక్రమాలు

శ్రీశైలంలో ఉపాసన సేవా కార్యక్రమాలు
x
Highlights

ఆపద సమయాల్లో చిక్కుకున్న వారికి కొంత సాయం చేస్తే అది మరువలేని విషయం.

ఆపద సమయాల్లో చిక్కుకున్న వారికి కొంత సాయం చేస్తే అది మరువలేని విషయం. కొంత మంది వీటిని పట్టించుకోగా, మరికొందరు ఇలాంటి ఆపత్కాల సమయాల్లో మేమున్నామంటూ ముందుకు వస్తారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి కోడలు, రాం చరణ్ భార్య ఉపాసన. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పలువురికి ఉపాసన సహాయం అందించారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న చెంచు కుటుంబాలకు తను సాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

కరోనాతో కష్టాల్లో చిక్కుకున్న కుటుంబాలకు చేయూత నిస్తున్నారు సెలబ్రేటీలు. లాక్ డౌన్ తో ఆర్థికంగా చితికిపోయిన చెంచు కుటుంబాలకు నేనున్నంటూ ముందుకొచ్చారు హీరో రాంచరణ్ భార్య ఉపాసన. ఇప్పటికే ఆమె హైదరాబాద్ లొ పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న విషయం తెలిసిందే.

అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం పరిసరాల్లోని నిరు పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ఉపాసన కొణిదెల. అలాగే స్థానిక చెంచులు, ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అటు పోలీసులకు మాస్క్‌లతోపాటు పీపీఈ కిట్లను అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.

దాదాపు 75 రోజుల తర్వాత శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనానికి అధికారులు అనుమతినిచ్చారు. దీంతో మంగళవారం మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెల స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం పేదలకు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories