Dimple Hayathi: డింపుల్ హయతి ఇంట్లోకి అగంతకులు.. పోలీసులు అలెర్ట్.. ట్విస్ట్ ఏంటంటే?

Dimple Hayathi: ఈ వివాదం నడుస్తుండగానే డింపుల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోకి యువతీయువకులు ప్రవేశించారు.

Jyothi
Published on: 26 May 2023 12:31 PM IST
Unknown Persons Enters Dimple Hayathi Home
X

Dimple Hayathi: డింపుల్ హయతి ఇంట్లోకి అగంతకులు.. పోలీసులు అలెర్ట్.. ట్విస్ట్ ఏంటంటే?

Dimple Hayathi: డింపుల్ హయతి మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తో కారు పార్కింగ్ వివాదంతో మీడియాకి ఎక్కారు. ఈ వివాదం నడుస్తుండగానే డింపుల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోకి యువతీయువకులు ప్రవేశించారు. అయితే హయతి హోమ్ మెయిడ్ వారిని గమనించి ఎవరని ప్రశ్నించడంతో వారు వెంటనే వెనుదిరిగారు. వారిని హయతి పెంపుడు శునకం వెంబడించింది. అగంతకుల ప్రవేశంపై సమాచారం అందుకున్న డింపుల్ 100కు డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు.

పోలీసుల అదుపులో అగంతకులు:

డింపుల్ హయతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా...తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని తెలిపారు. అగంతకులను కొప్పిశెట్టి సాయిబాబు, అతని బంధువు శ్రుతిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీతో డింపుల్ కు మధ్య వివాదం నేపథ్యంలో తమ అభిమాన నాయికను పరామర్శించేందుకు వచ్చామని వారు తెలిపారు. పోలీసులు ఆరా తీయగా నిజమే అని తేలింది. దీంతో ఇదే విషయాన్ని డింపుల్ కు చెప్పడంతో వారిని విడిచిపెట్టాల్సిందిగా కోరారు. హీరోయిన్ రిక్వెస్ట్ మేరకు యువతీయువకులను కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అగంతకుల కథకు హ్యాపీ ఎండింగ్ పడినట్టైంది.

Jyothi

Jyothi

Next Story