సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆమె కన్నుమూత

Raj
By Raj
Updated on: 16 Jun 2020 10:55 AM IST
సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆమె కన్నుమూత
X
Sushant Singh Rajput (File Photo)

ఇటీవల బాలీవుడ్‌‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ బాలీవుడ్ ప్రపంచం షాక్ లో మునిగిపోయింది. సుశాంత్ కుటుంబసభ్యులు అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో సుశాంత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్‌ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని అతని వదిన(కజిన్ బ్రదర్ భార్య) బీహార్‌లోని పూర్ణియాలో తన సోమవారం కన్నుముశారు. సుశాంత్‌ మరణంచిన విషయం తెలిసినప్పటినుంచి ఆమె దిగులుతో మంచం పట్టారు. అప్పటి నుంచి అన్నం మానేశారు దాంతో అనారోగ్యం భారిన పడి సుశాంత్ అంత్యక్రియల సమయంలో ఆమె తన ఇంట్లో తుది శ్వాస విడిచారు.

దీంతో కుటుంబసభ్యులు మరోసారి విషాదంలో మునిగిపోయారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఉదయం తన బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 34 ఏళ్ల సుశాంత్ సింగ్ కొంతకాలంగా డిప్రెషన్‌ లో ఉండటంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబై పోలీసులు గుర్తించారు. కాగా పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను సోమవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి.


Raj

Raj

Next Story