విడుదలకు సిద్ధమైన ఉదయ శంకర్ 'మిస్ మ్యాచ్'

విడుదలకు సిద్ధమైన ఉదయ శంకర్ మిస్ మ్యాచ్
x
Highlights

'ఆటగదరా శివా' ఫేం ఉదయ శంకర్ హీరోగా 'మిస్ మ్యాచ్' శరవేగంగా ముస్తాబయింది. డిసెంబర్ ఆరో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

'ఆటగదరా శివా' ఫేం ఉదయ శంకర్ హీరోగా 'మిస్ మ్యాచ్' శరవేగంగా ముస్తాబయింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ చూసిన అందరిలోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు ఈ మిస్ మ్యాచ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో హీరో ఉదయ శంకర్.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లు క్యూట్ గా కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మిస్ మ్యాచ్ డిసెంబర్ ఆరో తేదీన విడుదల చేయడానికి సంనాయాలు చేస్తున్నారు. ఈమేరకు పోస్టర్ లో మ్యాచ్ బిగెన్స్ ఫ్రం డిసెంబర్ 6 రిలీజ్ అంటూ డేట్ ప్రకటించారు. పోస్టర్ రీలిజ్ సందర్భంగా చిత్ర బృందం సినిమా గురించి మాట్లాడుతూ మిస్ మ్యాచ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని హంగులతో ముస్తాబయినట్టు చెప్పారు. ఉదయశంకర్ హీరోగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతాడన్నారు. ఇటు యాక్షన్ సీన్స్ లోనూ అటు రొమాంటిక్ సీన్లతో పాటూ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఉదయశంకర్ నటన ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' పతాకంపై నిర్మితమౌతున్న ఈ 'మిస్ మ్యాచ్' సినిమాకి ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ అంటోనీ హీరోగా తమిళంలో సలీం వంటి వియవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ కి ఇది తొలి తెలుగు సినిమా. జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ యాక్షన్ లవ్ స్టొరీగా 'మిస్ మ్యాచ్' రూపొందుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories