తన సూపర్ హిట్ పాట రీమిక్స్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్

ఆటగదరా శివ ఫేమ్ ఉదయ శంకర్ హీరోగా వస్తున్నా తాజా చిత్రం 'మిస్ మ్యాచ్'. ఈ సినిమాలో తొలిప్రేమలోని ఈ మనసే పాట రీ మిక్స్ చేశారు.

K V D Varma
Updated on: 1 Dec 2019 2:52 PM IST
తన సూపర్ హిట్ పాట రీమిక్స్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్
X
Pawan kalyan released Uday Shankar's Miss Match movie song

'ఆటగదరా శివా' ఫేమ్ ఉదయ శంకర్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా అయన 'మిస్ మ్యాచ్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ నుంచి యు సర్టిఫికెట్ పొందింది. ఈనెల 6 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే 'మిస్ మ్యాచ్' సినిమా టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

ఇక హీరో ఉదయ శంకర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అయన సినిమాల్లోని పాటలంటే ఆయనకు పిచ్చి. అందుకే, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ 'తొలిప్రేమ' సినిమాలోని ఓ పాటను 'మిస్ మ్యాచ్' కోసం రీమిక్స్ చేశారు. నా మనసే.. అంటూ సాగే ఈ పాట పవన్ కళ్యాణ్ తొలిప్రేమ లో సూపర్ హిట్ పాట.

ఈరోజు ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. తన పాటను చాలా అందంగా రీమిక్స్ చేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. అంతే కాదు పాటలో హీరో ఉదయ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వున్నదని ప్రశంసించారంట పవన్. ఈ విషయాన్ని ఉదయ శంకర్ తెలియచేశారు. అదేవిధంగా 'మిస్ మ్యాచ్' సినిమా టీమ్ కు ఈ సందర్భంగా పవన్ అయన బెస్ట్ విషెస్ తెలిపారు.

సింగిల్ షాట్‌లో...

ఈ పాట మొత్తం సింగిల్ షాట్‌లో షూట్ చేశామని తెలిపారు హీరో ఉదయ్ శంకర్. తన ఫేవరేట్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా పాటను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పవన్ కెరీర్‌లో తొలిప్రేమ బ్లా్క్ బస్టర్ విజయం సాధించిందని, అందులోనూ 'ఈ మనసే' పాట మరింత పాపులర్ అయిందని తెలిపారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని, ప్రేక్షకులు తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని పేర్కొన్నారు. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉంటుందని అన్నారు.

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' పతాకంపై నిర్మితమౌతున్న ఈ 'మిస్ మ్యాచ్' సినిమాకి ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ అంటోనీ హీరోగా తమిళంలో సలీం వంటి వియవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ కి ఇది తొలి తెలుగు సినిమా. జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ యాక్షన్ లవ్ స్టొరీగా 'మిస్ మ్యాచ్' రూపొందుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story