టీవీ ఇండస్ట్రీలో కరోనా కలకలం

Arun Chilukuri
Published on: 24 Jun 2020 12:25 PM IST
టీవీ ఇండస్ట్రీలో కరోనా కలకలం
X

హైద‌రాబాద్‌లో క‌రోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 62శాతం పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రోజుకి వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌గా ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కి గుర‌వుతున్నారు. అయితే క‌రోనా వ్యాప్తి కారణంగా మూడు నెల‌లుగా షూటింగ్స్ కూడా నిలిచిపోగా.. ప్రభుత్వ అనుమతితో జూన్ 1 నుంచి షూటింగులు ప్రారంభం అయ్యాయి. కొన్ని సెట్స్ పైకి వెళుతున్నాయి. క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ షూటింగ్ జ‌రుపుతున్నారు.

అయితే తాజాగా ఓ టీవీ నటుడికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. లాక్ డౌన్ అనంతరం సీరియల్ షూటింగ్స్ ప్రారంభమైయ్యాయి. అయితే టీవీ కార్మికులు కరోనా బారినపడ్డరు. అలాగే మరో ప్రముఖ టీవీ ఛానెల్ సీరియల్ యూనిట్ మెంబెర్స్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. టీవీ సీరియల్ నిర్మాతల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిర్వహించడం పై చర్చించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story