Divorce Photoshoot: విడాకుల పండుగ.. మాజీ భర్తతో దిగిన ఫోటోలను చించేస్తూ.. నటి షాలిని సంచలనం..

Divorce Photoshoot: భర్త నుంచి విడిపోయిన సందర్భంలో ఏ మహిళ అయినా తీవ్ర మనస్థాపానికి గురవుతుంది.

Arun Chilukuri
Updated on: 3 May 2023 1:00 PM IST
TV Actress Shalini Divorce Photoshoot
X

Divorce Photoshoot: విడాకుల పండుగ.. మాజీ భర్తతో దిగిన ఫోటోలను చించేస్తూ.. నటి షాలిని సంచలనం..

Divorce Photoshoot: భర్త నుంచి విడిపోయిన సందర్భంలో ఏ మహిళ అయినా తీవ్ర మనస్థాపానికి గురవుతుంది. తన భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ డిప్రెషన్ కు గురవుతారు. సాధారణ మహిళల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయం కూడా ఇలా జరుగుతుంది. హీరోయిన్ సమంత తన భర్త హీరో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ విషయాన్ని సామ్ చాలాసార్లు బయటకు చెప్పింది కూడా..అయితే ఇప్పుడు కొంతమంది మహిళలు మాత్రం భర్తతో విడాకులు తీసుకొని పండుగ చేసుకుంటున్నారు. భర్తతో విడిపోయిన విషయాన్ని గర్వంగా చెబుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

తమిళ టీవీ నటి, ఫ్యాషన్ డిజైనర్ షాలిని ఇటీవలే తన భర్తతో విడిపోయింది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేయడంతో షాలిని ఈ అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటో షూట్ చేసింది. రెడ్ కలర్ డ్రస్ ధరించి..చేతిలో డైవర్స్ అనే అక్షరాలు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు భర్త రియాజ్ తో కలిసి దిగిన ఫోటోను రెండుగా చించేస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించింది.

నటి షాలిని ఈ ఫోటో షూట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు 99 సమస్యలు ఉన్నాయని భర్త ఒకటి కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి తాను ఇచ్చే సందేశం ఇదే అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. విడాకులు తీసుకోవడం ఫెయిల్యూర్ కాదని..జీవితానికో మలుపు..అని షాలినీ తన మనసులో మాటను బయటపెట్టింది. నటి షాలిని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఈమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఫొటోలను చూస్తే మాజీ భర్తకు హార్ట్ ఎటాక్ రావడం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story