TV Actor Sameer Sharma Dead : నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య!

TV Actor Sameer Sharma Dead : బాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం

Krishna
Published on: 6 Aug 2020 3:24 PM IST
TV Actor Sameer Sharma Dead :  నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య!
X
Sameer Sharma (File Photo)

TV Actor Sameer Sharma Dead : బాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి బయటకు రాకముందే మరో ఘటన చోటు చేసుకుంది.. తాజాగా హిందీ నటుడు సమీర్‌ శర్మ మృతి చెందాడు.. ముంబైలోని మలాద్‌లో తానూ అద్దెకుంటున్న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు.. సూసైడ్ లాంటి నోటీసు ఏమీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.. అయితే సమీర్ రెండు, మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమీర్‌ ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా సమీర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు..పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అసలు సమీర్ ది హత్యా? లేకాఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను డిప్రెషన్ ఉన్నట్లుగా ఇన్ స్టాగ్రామ్‌లో ఇటీవల ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు.

ఇక లాక్ డౌన్ సమయంలో చాలా మంది నటులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక సమీర్ హసీ తో ఫసీ వంటి సినిమాలతో పాటు కహానీ ఘర్‌ ఘర్‌ కీ, క్యోంకీ సాస్‌ భీ కభీ బహూ థీ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం సమీర్ యే రిష్తే హై ప్యార్‌ కే సీరియల్‌లో నటిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story