అల్లు అర్జున్‌కు షాకిచ్చిన స‌జ్జ‌నార్‌.. లీగ‌ల్ నోటీసులు పంపిన..

Allu Arjun: అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు టీఎస్‌ ఆర్టీసీ నోటీసులిచ్చింది.

Arun Chilukuri
Published on: 9 Nov 2021 8:33 PM IST
TSRTC Send Legal Notice to Allu Arjun and Rapido
X

అల్లు అర్జున్‌కు షాకిచ్చిన స‌జ్జ‌నార్‌.. లీగ‌ల్ నోటీసులు పంపిన..

Allu Arjun: అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు టీఎస్‌ ఆర్టీసీ నోటీసులిచ్చింది. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇరువురికి లీగల్ నోటీసులు పంపిన సజ్జనార్ ప్రజలకు మంచి చేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. సాధారణ దోసలతో ఆర్టీసీ బస్సులను పోల్చడం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీని కించ‌ప‌రిస్తే సంస్థ‌, ఉద్యోగులు, ప్ర‌యాణికులు స‌హించ‌రు అని సజ్జ‌నార్ తేల్చిచెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవ‌లో ఉంది. ప్ర‌జా ర‌వాణాను ప్రోత్స‌హించే ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టులు న‌టించాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story