క్లారిటీ ఇచ్చినా తగ్గని ప్రచారం..

క్లారిటీ ఇచ్చినా తగ్గని ప్రచారం..
x
Highlights

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలపతి విజయ్ ఫ్యామిలీ డ్రామా రక్తి కడుతోంది. తాను రాజకీయాల్లోకి రానని హీరో విజయ్ ఖచ్చితంగా చెప్పేసినా కోలీవుడ్ లో ఆ హీరో ఫ్యామిలీ వదిలిన ఫీలర్స్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలపతి విజయ్ ఫ్యామిలీ డ్రామా రక్తి కడుతోంది. తాను రాజకీయాల్లోకి రానని హీరో విజయ్ ఖచ్చితంగా చెప్పేసినా కోలీవుడ్ లో ఆ హీరో ఫ్యామిలీ వదిలిన ఫీలర్స్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రానని, రాలేనని విజయ్ చెప్పినా.. భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం తప్పదని కొందరు తమిళనాడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా నిన్నటి విజయ్ స్టేట్ మెంట్స్‌పై ఇవాళ ఆయన తండ్రి ఎస్. ఏ చంద్రశేఖర్ ఇచ్చిన వివరణ ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.

విజయ్ స్టేట్ మెంట్స్‌పై స్పందించాల్సింది తాను కాదని, అలా ఎందుకు స్పందించాడో విజయ్ మాత్రమే చెప్పగలడంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చారు. తలపతి రాజకీయ అరంగేట్రం ఖాయమనే అనుమానాలు కలిగించేవిగా చంద్రశేఖర్ మాటలున్నాయి. ఏ ఉద్దేశాలు లేకుండా విజయ్ అనుమతి లేకుండా ఆయన అభిమాన సంఘం పేరిట ఈసీలో పార్టీ రిజిస్ట్రేషన్ జరగదని కోలీవుడ్ పరిణామాలను దగ్గర నుంచి చూసిన వారు చెబుతున్నారు.

తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణంతో ఎన్నడూ లేనంతగా రాజకీయ శూన్యత ఏర్పడింది. దిగ్గజ రాజకీయ నేతల మరణంతో రెండు పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఏర్పడిన శూన్యతను భర్తీ చేయగలనన్ననమ్మకంతోనే కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం చేశారు. మక్కల్ నీదీ మయ్యం పార్టీ పేరుతో గత ఎన్నికల్లో పోటీ చేసినా ..విజయం సాధించలేకపోయినా తనకు రాజకీయ భవిష్యత్తు ఉందనే కమల్ నమ్ముతున్నారు. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనుమానమేననే సందేహాలు కలుగుతున్నాయి.

ఇలాంటి టైమ్ లో విజయ్ అడుగు పెడితే సునాయాసంగా గెలుపు ఖాయమని విజయ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ ధైర్యంతోనే విజయ్ తండ్రి ఓ అడుగు ముందుకేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తీరా రిజిస్ట్రేషన్ కూడా అయ్యాక విజయ్ కాదని ఖండించడంతో తెర వెనుక ఏం జరిగి ఉండొచ్చన్న అంశంపై విశ్లేషకులు రకరకాలుగా అంచనా వేస్తున్నారు. నిన్నటి విజయ్ ప్రకటనతో ఈ తుఫాన్ చల్లారుతుందని భావించినా.. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తాజా ప్రకటనలతో తెర వెనుక కొత్త ప్రయత్నమేదో జరుగుతోందన్నది పక్కాగా అనిపిస్తోంది. చూడాలి తలపతి పొలిటికల్ ఎంట్రీ.. ఎంత దూరంలో ఉందో..అ సలు ఉందో లేదో.. కాలమే నిర్ణయించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories