Nithin-Shalini Marriage: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైనా నితిన్ - షాలిని జంట!

Nithin-Shalini Marriage: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు నితిన్ - షాలిని జంట.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.

Krishna
Published on: 27 July 2020 12:08 PM IST
Nithin-Shalini Marriage: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైనా నితిన్ - షాలిని జంట!
X
Nithin - shalini Marriage

Nithin-Shalini Marriage: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు నితిన్ - షాలిని జంట.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. కరోనా నేపధ్యంలో జరిగిన పెళ్లి కావడంతో పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. కథానాయకులు వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ తదితరులు హాజరై కొత్త జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినిమా పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్ తేజ్ లు హాజరయ్యారు. ఇక నితిన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంగ్ దే టీజర్:

నితిన్ పెళ్లిసందర్భంగా ఆయన నటిస్తున్న రంగ్ దే చిత్రం నుంచి చిత్ర యూనిట్ నితిన్ కి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీజర్ ని విడుదల చేసింది. మిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లి కొడుకెక్కడా అంటూ వ‌చ్చే వాయిస్ ఓవ‌ర్ తో టీజ‌ర్ షురూ మొదలవుతుంది. ఇక నితిన్ ని పట్టుకొని కీర్తిసురేశ్ ఆఫీసులో తానూ నా బాయ్ ఫ్రెండ్ అంటూ అందరికి చెప్తుంటే.. నితిన్ మాత్రం చేస్తూ అది నా గ‌ర్ల్ ఫ్రెండ్ కాదంటూ ఉండడం ఆసక్తికరంగా ఉంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.. తాజాగా ఈ ఏడాది భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Krishna

Krishna

Next Story