బాలీవుడ్ పైనే ఆశలన్నీ పెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Pooja Hegde: ప్రేక్షకుల దృష్టిలో పడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న స్టార్ బ్యూటీ

Jyothi
Published on: 19 April 2023 11:08 AM IST
Tollywood Star Heroine has All her Hopes on Bollywood
X

బాలీవుడ్ పైనే ఆశలన్నీ పెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Pooja Hegde: డస్కీ బ్యూటీ పూజా హెగ్డే చాలా తక్కువ సమయంలో టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అల్లు అర్జున్ తో "డీ జే" సినిమా తర్వాత నుండి పూజ హెగ్డే పేరు మారు మ్రోగుతునే ఉంది. ఇండస్ట్రీ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసింది ఈ భామ. కానీ గతేడాది పూజ హెగ్డే కి ఈ మాత్రం కలిసి రాలేదు. వరుసగా డిజాస్టర్ లు రావడంతో ఈమె ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు సరసన చేస్తున్న #SSMB28 సినిమా తప్ప పూజ వద్ద మరే తెలుగు సినిమా లేదు.

పూజా హెగ్డే తన బాలీవుడ్ ఖరియర్ మీద కూడా బాగానే ఆశలు పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" విడుదల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో పూజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయితే పూజాకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోయినప్పటికీ కనీసం సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

సినిమా ప్రమోషన్ల పేరుతో పొట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా అవార్డు ఈవెంట్లు మరియు ఇఫ్తార్ పార్టీలు కూడా హాజరవుతూ ప్రేక్షకులు దృష్టిలో పడడానికి ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే. మరి పూజా హెగ్డే చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఆమెకు ఉపయోగపడి సినిమా తర్వాత ఆమెకి క్రేజ్ పెరుగుతుందో వేచి చూడాలి. మరోవైపు #SSMB28 సినిమా హిట్ అయిన కూడా పూజ హెగ్డే కి తెలుగులో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story