
Tollywood hero vijay deverakonda's dear comrade movie achieve 2 million likes on youtube
Vijay Devarakonda : తెలుగు సినిమాలను వేరే భాషల్లోకి డబ్ చేయడం అనేది పెద్ద విషయం ఏమి కాదు .. కానీ సాధారణంగా అయితే తెలుగులో మంచి హిట్టు
Vijay Devarakonda : తెలుగు సినిమాలను వేరే భాషల్లోకి డబ్ చేయడం అనేది పెద్ద విషయం ఏమి కాదు .. కానీ సాధారణంగా అయితే తెలుగులో మంచి హిట్టు అయిన సినిమాలనే డబ్ చేయడానికి సదరు నిర్మాతలు ఇష్టపడుతుంటారు .. కానీ ఈ మధ్య ప్లాప్ సినిమాలకు కూడా డబ్ చేస్తున్నారు .. ఈ నేపధ్యంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో వదలగా దానికి ఇప్పుడు 2 మిలియన్ లైక్స్ వచ్చాయి.. దీనితో ఇండియాలోనే ఒక ఫస్ట్ ఎవర్ రికార్డును కొట్టిన ఫస్ట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. అది కూడా కేవలం 7 నెలల్లోనే 160 మిలియన్స్ తో ఈ ఫీట్ ను అందుకోవడం మరో విశేషంగా చెప్పవచ్చు..
ఇందులో విజయ్ దేవరకొండ సరనస రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వీరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. తెలుగు తమిళ్ బాషలలో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం 2019లో విడుదలైంది.. టాక్సీవాలా లాంటి భారీ విజయం తర్వాత విజయ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ విజయ్ అభిమానులకి ఇదో స్పెషల్ మూవీని అని చెప్పవచ్చు..
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
Lilly & Bobby ❤️#DearComrade https://t.co/leRMFBwxeg pic.twitter.com/jXRGWtNwDl
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




