విజ‌య్,పూరి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌?

విజ‌య్,పూరి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌?
x
Hero vijay devarakonda(File photo)
Highlights

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే అది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని నిర్మతాల్లో ఒకరైనా చార్మీ వెల్లడించారు. అంతేకాకుండా పూరి, విజయ్ సినిమా అంటే టైటిల్ క్రేజీగా ఉంటుందని చార్మీ చెప్పుకొచ్చారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేసారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే తాజాగా ఈ సినిమాకి లిగ‌ర్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. లిగ‌ర్ అంటే మ‌గ సింహంకి, ఆడ పులికి పుట్టిన క్రాస్ బ్రీడ్ అని అర్ధమట.. టైటిల్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పూరీ ఈ టైటిల్‌ని ఫైన‌ల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. బాక్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. ముంబైలో మొదలైన సినిమా షూటింగ్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించారు. అ తరవాత దేశంలో కరోనా మొదలవ్వడంతో సినిమా షూటింగ్ ని వాయుదా వేశారు.

ఈ సినిమాలో యాక్షన్‌ హంగులతో పాటు కంటతడి పెట్టించే భావోద్వేగమైన సన్నివేశాలు కూడా ఉండబోతున్నయాట.. మదర్‌ సెంటిమెంట్‌ గా వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేయనున్నాయని సమాచారం.. ఇందులో విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని చార్మీతో పాటుగా కరణ్‌జోహార్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ‌ అన‌న్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories