Friendship Day 2020: 'చిరుత' కు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పిన 'ఎక్స్ ప్రెస్ రాజా'

Friendship Day 2020: స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు.

S. Srikanth
Published on: 2 Aug 2020 3:15 PM IST
Friendship Day 2020: చిరుత కు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పిన ఎక్స్ ప్రెస్ రాజా
X
Sharwanand and Ram Charan (File Photo)

Friendship Day 2020: స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడుతోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం 'స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదయంలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది...ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది... కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం.

కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకుఅందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు.

అయితే, స్నేహితుల దినోత్సవం సందర్బంగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన మిత్రులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు. శర్వానంద్ తన మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేసారు. అంతే కాదు వీరిద్దరూ అయ్యప్ప భక్తులు కావటం విశేషం. ఎప్పుడు మల ధరించినా ఇద్దరూ కలిసే దీక్ష స్వీకరిస్తుంటారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణం వాయిదా పడింది.



S. Srikanth

S. Srikanth

Next Story