Hero Sharwanand Adopts A Park: ఆ పార్కును దత్తత తీసుకున్న హీరో శర్వానంద్.. !

Hero Sharwanand Adopts A Park: ఆ పార్కును దత్తత తీసుకున్న హీరో శర్వానంద్.. !
x
Hero Sharwanand Takes Up The Green India Challenge And Adopts A Park Near His Home
Highlights

Hero Sharwanand Adopts A Park: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Hero Sharwanand Adopts A Park: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారు కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. అందులో భాగంగానే సినీ హీరో శర్వానంద్ సోమ‌వారం స్వచ్ఛందంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు. ఇందులో శర్వానంద్ తో పాటుగా ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. " ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ గొప్ప కార్యక్రమం అన్నారు. రోజురోజుకు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఆలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మనం కచ్చితంగా మొక్కలు నాటలని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని శర్వానంద్ కోరారు. ఇక సినీ నిర్మాత‌లు అనిల్ సుంకర (ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌), రామ్ ఆచంట - గోపి ఆచంట (14 రీల్స్ ప్లస్‌), వంశీ - విక్కీ - ప్రమోద్ (యూవీ క్రియేషన్స్), సుధాకర్ చెరుకూరి (ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌)ల‌కు మొక్కలు నాటాలని శ‌ర్వానంద్‌ కోరారు.

అంతే కాకుండా త‌మ‌ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే భాద్యతను ఏర్పాటు చేస్తానని, ఆ పార్కును తాను దత్తత తీసుకొని, అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటాన‌ని శర్వానంద్ వెల్లడించాడు. ఇక తన ఆహ్వానం మేరకు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శర్వానంద్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ బాగానే ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కీరవాణి, శ్రీకారం అనే సినిమాలను చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories