Ram Charan to Work with Venky Kudumula: ఆ దర్శకుడికి 'ఛలో' అనేసిన రామ్‌చరణ్‌ .. దసరాకే ముహూర్తం!

చేసినవి రెండే సినిమాలు అయినప్పటికీ భారీ హిట్లు కొట్టి అందరు దృష్టిలో పడ్డాడు దర్శకుడు వెంకీ కుడుముల.. వెంకీ కుడుములతో

Krishna
Published on: 21 July 2020 9:30 PM IST
Ram Charan to Work with Venky Kudumula: ఆ దర్శకుడికి ఛలో అనేసిన రామ్‌చరణ్‌ .. దసరాకే ముహూర్తం!
X
Ram charan (File Photo)

చేసినవి రెండే సినిమాలు అయినప్పటికీ భారీ హిట్లు కొట్టి అందరు దృష్టిలో పడ్డాడు దర్శకుడు వెంకీ కుడుముల.. వెంకీ కుడుములతో సినిమా అంటే మినిమం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకాన్ని కలిగించాడు. నాగాశౌర్య హీరోగా వచ్చిన 'ఛలో' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన వెంకీ కుడుముల.. తాజాగా నితిన్ హీరోగా వచ్చిన 'భీష్మ' సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అయితే వెంకీ కుడుముల తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ తో ఉంటుందని టాలీవుడ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తుంది.

తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో రామ్ చరణ్ ని కలిసిన వెంకీ కుడుముల చెప్పిన కథకి ఫిదా అయిపోయారట..కథ బాగా చెప్పడంతో సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఛలో', 'భీష్మ' సినిమాల తరహాలోనే ప్రేమ, వినోదం కలగలిపి ఈ సినిమా కూడా ఉంటుందని సమాచారం.. ప్రస్తుతం వెంకీ పుల్ స్క్రిప్ట్ ని సిద్దం చేసే పనిలో ఉన్నాడట.. ఇక ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం..చరణ్‌ చాలా రోజుల నుంచి యువీ క్రియేషన్స్ తో సినిమా చేయలని అనుకుంటున్నాడట..సో మొత్తానికి ఇలా కుదిరిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజయదశమి సందర్భంగా ఈ సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది!

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్. అర్ చిత్రంలో నటిస్తున్నాడు ఇందులో మరో హీరోగా ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Krishna

Krishna

Next Story