Mega Heros Teenage pic viral in social media : మెగా హీరోలు టీనేజ్ లో ఎలా ఉన్నారో చూడండి!

Mega heros teenage pic viral in social media : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్టార్ హీరోలు

Krishna
Published on: 21 July 2020 1:25 PM IST
Mega Heros Teenage pic viral in social media : మెగా హీరోలు  టీనేజ్ లో ఎలా ఉన్నారో చూడండి!
X
Mega Family old pic viral in social media

Mega heros teenage pic viral in social media :టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్టార్ హీరోలు కాగా, రామ్ చరణ్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడిప్పుడు స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. క్రికెట్ టీంలా మారిన మెగా ఫ్యామిలీ హీరోలు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. తాజాగా మెగా హీరోస్ టీనేజ్ కి సంబంధించిన ఓ ఓల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఈ ఫోటోలో అల్లు అర్జున్, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో పాటుగా నిహారిక కూడా ఉన్నారు. అప్పుడు టీనేజ్ లో ఉన్న మెగా హీరోల లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీనితో మెగా ఫాన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మెగా హీరోలు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో బిజీగా ఉన్నాడు. అటు వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ బాక్సింగ్ బేస్డ్ మూవీలొ నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. కానీ ఈ చిత్రాలు లాక్ డౌన్ వలన వాయిదా పడ్డాయి.

ఇక నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. త్వరలో వీరికి నిశ్చితార్థం జరుగుతుందని, వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందని సమాచారం.

Krishna

Krishna

Next Story