ప్రభాస్ రేర్ ఫీట్ ... తొలి సౌత్ ఇండియా స్టార్‌గా రికార్డు!

ప్రభాస్ రేర్ ఫీట్ ... తొలి సౌత్ ఇండియా స్టార్‌గా రికార్డు!
x

Prabhas 

Highlights

Prabhas Followers On Facebook : బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ కి ముద్రపడిపోయింది.

Prabhas Followers On Facebook : బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ కి ముద్రపడిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తన మార్కెట్ ని మరింతగా పెంచుకుంటూ అన్ని పాన్ ఇండియా మూవీలానే చేస్తున్నాడు ప్రభాస్.. ఇక సినిమాలతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు.. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో తన అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. తాజాగా ఫేస్‌బుక్‌లో 20 మిలియన్ల (2 కోట్ల) ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియా స్టార్‌గా రికార్డు నెలకొల్పాడు ప్రభాస్.

ఈ ఏడాది జులై నాటికి ప్రభాస్ ఫేస్‌బుక్‌ ఖాతాలో 16 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఈ రెండు నెలలోనే మరో 4 మిలియన్ల ఫాలోవర్స్‌ వచ్చారు. దీనితో ప్రస్తుతం అతనిఫేస్‌బుక్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ నువ్వు తోప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, మహేష్, చరణ్, ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఓం రౌత్ డైరెక్షన్ లలో సినిమాలని చేయనున్నాడు ప్రభాస్..

Show Full Article
Print Article
Next Story
More Stories