ప్రభాస్ 'ఆదిపురుష్‌'లో లక్ష్మణుడిగా ఎవరో తెలుసా?

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని

Krishna
Published on: 21 Sept 2020 4:22 PM IST
ప్రభాస్ ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా ఎవరో తెలుసా?
X

atharvaa murali 

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ గా వచ్చిన ప్రకటనతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో కాస్టింగ్ భారీగానే ఉండబోతుంది. ఇప్పటికే రాముడిగా ప్రభాస్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్.. ఇక మిగిలిన పాత్రల కోసం వేట మొదలు పెట్టారు.. ఇందులో సీత పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఖరారు కాలేదు. ఇక సినిమాలో లక్ష్మణుడి పాత్రకి గాను సౌత్ హీరో అథర్వ మురళిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే అతనితో కథ చర్చలు జరగగా, అతను కూడా ఒకే చెప్పినట్టు సమాచారం.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది.. ఇక అథర్వ మురళి హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా గతేడాది వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.. ఇక అటు జనవరి నుంచి ఆదిపురుష్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది..

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Krishna

Krishna

Next Story