నితిన్ తో ప్రగ‌తి.. రెడ్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్నారు!

Nithin With Pragathi : టాలీవుడ్ నటి ప్రగతి అందరికి సుపరిచితురాలే.. అమ్మ,అత్త పాత్రల్లో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తోంది ప్రగతి.. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Krishna
Published on: 11 Oct 2020 11:51 AM IST
నితిన్ తో ప్రగ‌తి.. రెడ్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్నారు!
X

Nithin With Pragathi 

Nithin With Pragathi : టాలీవుడ్ నటి ప్రగతి అందరికి సుపరిచితురాలే.. అమ్మ,అత్త పాత్రల్లో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తోంది ప్రగతి.. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి సంబంధించిన ఫోటోలు, జిమ్ వీడియోలను రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా యంగ్ హీరో నితిన్ తో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసింది ప్రగ‌తి.. ఈ ఫోటోలో ఇద్దరు రెడ్ ఔట్ ఫిట్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నారు. అయితే ఇది ఎక్కడ అన్నదానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అభిమానులు మాత్రం.. ఇది ఓ యాడ్ షూటింగ్‌లో దిగిన ఫోటో అని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు ఈ మధ్యే తానూ ఓ యాడ్ చేసినట్టుగా నితిన్ వెల్లడించిన సంగతి తెలిసిందే..

ఇక ఈ ఏడాది భీష్మ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అయింది. ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'అంధాదున్' సినిమాను రిమేక్ చేస్తున్నాడు.. ఒరిజినల్ లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ సొంతగా నిర్మిస్తున్నాడు.. అంతేకాకుండా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చక్ర అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమాని చేస్తున్నాడు నితిన్.. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు..

View this post on Instagram

Update soon 🤩💫

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

Krishna

Krishna

Next Story