Nithin Gift To Venky Kudumula : భీష్మ దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్‌!

Nithin Gift To Venky Kudumula : యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన

Krishna
Published on: 9 Sept 2020 11:29 AM IST
Nithin Gift To Venky Kudumula : భీష్మ దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్‌!
X

Nithin Gift To Venky Kudumula

Nithin Gift To Venky Kudumula : యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భీష్మ'... మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ ని సంపాదించుకొని భారీ విజయాన్ని అందుకుంది.. శ్రీనివాస కళ్యాణం లాంటి ప్లాప్ తరవాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేసిన నితిన్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వినిపించింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచి సినిమాని బ్లాక్ బస్టర్ మూవీగా నిలబెట్టింది.

అయితే తనని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించిన దర్శకుడు వెంకీ కుడుములకి హీరో నితిన్ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు.. వెంకీ కుడుముల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు నితిన్. ఈ విషయాన్ని వెంకీ కుడుముల తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ''ఉత్తమ వ్యక్తితో ఉత్తమైన సినిమాలు తీసినప్పుడు ఇలాంటి ఉత్తమైనవి జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అన్నా'' అని పేర్కొంటూ ఆ కారుతో దిగిన పిక్ షేర్ చేస్తూ తన ఆనందాన్ని వెల్లడించాడు.


ఇక తన ప్రేయసి శాలినిని పెళ్లి చేసుకున్న నితిన్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ప్రసుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్.. ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. . ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నితిన్..

Krishna

Krishna

Next Story