Bheeshma: లాభాల బాటలో నితిన్ భీష్మ .. డిస్ట్రిబ్యూటర్లుకి పండగే పండగ

యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ' భీష్మ' అనే సినిమాని చేశాడు.. .. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా
యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ' భీష్మ' అనే సినిమాని చేశాడు.. .. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గాతెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సీతార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి.
దీనితో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దుమ్ములేపుతుంది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించగా, ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 10 రోజుల్లో 26.28 కోట్లను సాధించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఈ సినిమాకి 22 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ .. ఇక సినిమాని కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో మంచి అంచనాల మధ్య వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం..
ఇక ఈ చిత్రం 10 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :
♦ నైజాం 8.57 cr
♦ సీడెడ్ 3.13 cr
♦ ఉత్తరాంధ్ర 2.86 cr
♦ ఈస్ట్ 1.64 cr
♦ వెస్ట్ 1.21 cr
♦ కృష్ణా 1.44 cr
♦ గుంటూరు 1.73 cr
♦ నెల్లూరు 0.72 cr
♦ రెస్ట్ ఆఫ్ ఇండియా 1.88 cr
♦ ఓవర్సీస్ 3.10 cr
♦ వరల్డ్ వైడ్ టోటల్ 26.28 cr
ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT