Rang De Teaser Release: రంగ్ దే టీజర్ వచ్చేసింది!

Rang De Teaser Release: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

Krishna
Published on: 26 July 2020 7:40 PM IST
Rang De Teaser Release: రంగ్ దే టీజర్ వచ్చేసింది!
X
Rang de teaser

Rang De Teaser Release: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు కందుకూరి షాలిని మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు నితిన్.. హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా హోటల్ లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నితిన్ - షాలినీ ఒకటి కాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కేవలం అతి కొద్ది మంది సమక్షంలోనే నితిన్ పెళ్లి జరగనుంది. ఇక ఇప్పటికే జరిగిన మెహందీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే నితిన్ పెళ్లి సందర్భంగా నితిన్ నటిస్తున్న 'రంగ్‌దే' చిత్ర బృందం ఆయనకు పెళ్లి గిఫ్ట్‌ ఇచ్చింది. నితిన్‌కు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ సినిమాకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లి కొడుకెక్కడా అంటూ వ‌చ్చే వాయిస్ ఓవ‌ర్ తో టీజ‌ర్ షురూ మొదలవుతుంది. ఇక నితిన్ ని పట్టుకొని కీర్తిసురేశ్ ఆఫీసులో తానూ నా బాయ్ ఫ్రెండ్ అంటూ అందరికి చెప్తుంటే.. నితిన్ మాత్రం చేస్తూ అది నా గ‌ర్ల్ ఫ్రెండ్ కాదంటూ ఉండడం ఆసక్తికరంగా ఉంది.

అయితే ఈ టీజర్ పైన నితిన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. " 'ఈ రోజుకు అదనపు ప్రత్యేకతను తీసుకొచ్చిన 'రంగ్‌దే' చిత్ర బృందానికి ధన్యవాదాలు. నా చిత్ర నుంచి అభిమానులు, స్నేహితుల కోసం ఈ ఫన్‌ టీజర్‌. ఆస్వాదించండి" అంటూ ట్వీట్ చేశాడు నితిన్..


వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం.. తాజాగా ఈ ఏడాది భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.

Krishna

Krishna

Next Story