నాకు ఏం బాధ లేదు బ్రదర్.. నెటిజన్ కు నవదీప్ కౌంటర్!

Navadeep Counter To Netizen : బాలీవుడ్ నుంచి శాండిల్ వుడ్ మీదిగా టాలీవుడ్ వైపుగా డ్రగ్స్ ప్రకంపనులు చేరుకున్నాయి.. బాలీవుడ్ నటి, సుశాంత్

Krishna
Updated on: 13 Sept 2020 11:33 AM IST
నాకు ఏం బాధ లేదు బ్రదర్.. నెటిజన్ కు నవదీప్ కౌంటర్!
X

Navadeep Counter To Netizen : బాలీవుడ్ నుంచి శాండిల్ వుడ్ మీదిగా టాలీవుడ్ వైపుగా డ్రగ్స్ ప్రకంపనులు చేరుకున్నాయి.. బాలీవుడ్ నటి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారించిన ఎన్‌సీబీ పలు కీలక విషయాలను రాబట్టింది. విచారణలో భాగంగా రియా 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉన్నట్లుగా వార్తలు రావడంతో టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ పుట్టించింది. రకుల్‌, రియా కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా 30 వేల ట్వీట్లతో RakulPreetSingh అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ క్రమంలోనే హీరో నవదీప్‌ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌.. 'ఇది మళ్లీ టాలీవుడ్‌కు యూటర్న్‌ తీసుకుంది. నవదీప్‌ అన్న మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచెం జాగ్రత్త' అంటూ వెటకారంగా పోస్ట్ చేశాడు. అయితే దీనికి నవదీప్ స్పందిస్తూ.. 'నాకు ఏం బాధ లేదు బ్రదర్‌.. నువ్వు కూడా బాధపడకు. పద పనికొచ్చే పనులు చేద్దాం' అంటూ సమాధానం ఇచ్చాడు. గతంలో 2017 సంవత్సరంలో టాలీవుడ్ లో డ్రగ్స్ ఇష్యూ పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. అందులో హీరో నవదీప్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత విచారణ కూడా జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో వారికి క్లీన్ చీట్ లభించింది.



Krishna

Krishna

Next Story