డ్యూయల్ రోల్‌లో మహేష్‌ లుక్ అదిరింది

డ్యూయల్ రోల్‌లో మహేష్‌ లుక్ అదిరింది
x
Highlights

Mahesh Babu Dual Role : మహేష్ బాబు ఏంటి.. డ్యూయల్ రోల్‌ ఏంటి.. అని ఆశర్చపోకండి.. డ్యూయల్ రోల్ అంటే అస్సలు ఒప్పుకొని మహేష్ ఓ యాడ్ కోసం డ్యూయల్ రోల్ లో కనిపించి అందరిని సప్ రైజ్ చేశాడు.

Mahesh Babu Dual Role : మహేష్ బాబు ఏంటి.. డ్యూయల్ రోల్‌ ఏంటి.. అని ఆశర్చపోకండి.. డ్యూయల్ రోల్ అంటే అస్సలు ఒప్పుకొని మహేష్ ఓ యాడ్ కోసం డ్యూయల్ రోల్ లో కనిపించి అందరిని సప్ రైజ్ చేశాడు. ఈ డ్యూయల్ రోల్‌ లో మహేష్ అన్న తమ్ముడుగా నటించాడు. 'ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌' షురూ అంటూ తాజాగా మహేష్ పైన యాడ్ చేశారు. ఈ యాడ్ ని తాజాగా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ యాడ్ లో మహేష్ బాబు మీసాలతో కనిపించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు..

ఇందులో మహేష్ బాబు మరింత అందంగా కనిపించడం, డ్యూయల్ రోల్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో సూపర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ప్రస్తుతం ఈ యాప్ కి వీపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇక చివరిగా మహేష్ బాబు నాని సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించగా, అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించారు.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories