Mahesh Babu Sarkaru Vaari Paata : మహేష్ కి చరణ్ విలన్?

Mahesh Babu Sarkaru Vaari Paata : ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు.

Krishna
Published on: 29 Sept 2020 2:49 PM IST
Mahesh Babu Sarkaru Vaari Paata : మహేష్ కి చరణ్ విలన్?
X

 Mahesh Babu 

Mahesh Babu Sarkaru Vaari Paata : ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా ఎవరు నటించనున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముందుగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ని అనుకున్నారు కానీ అతని డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు.. ఆ తరవాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో తన పాత్ర బాగా నచ్చి అరవింద్ స్వామి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ స్వామి రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాలో విలన్ గా నటించి స్టైలిష్ విలన్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కి అక్కగా విద్యాబాలన్ నటిస్తోందని సమాచారం.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది!

వాస్తవానికి మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కథ అసంపూర్తిగా ఉండడం, మహేష్ చిన్న చిన్న మార్పులు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టారని సమాచారం.. దీనితో లైన్ లోకి పరుశురాం సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీతో చేస్తారా లేదా అన్నది చూడాలి మరి!

Krishna

Krishna

Next Story