Mahesh Babu's Sarkaru Vaari Paata : మహేష్ ని ఢీ కొట్టబోతున్న బాలీవుడ్ నటుడు?

Mahesh Babu’s Sarkaru Vaari Paata : ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం

Krishna
Published on: 11 Sept 2020 2:22 PM IST
Mahesh Babus Sarkaru Vaari Paata : మహేష్ ని ఢీ కొట్టబోతున్న బాలీవుడ్ నటుడు?
X

Mahesh Babu

Mahesh Babu's Sarkaru Vaari Paata : ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇందులో విలన్ గా ఎవరు నటించనున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముందుగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ని అనుకున్నారు కానీ అతని డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు పరుశురాం అనిల్ కపూర్‌కు ఫోన్ కాల్ ద్వారా స్క్రిప్ట్‌ను వివరించాడట.. స్క్రిప్ట్ కి తన పాత్రకి అనిల్ కపూర్ చాలా ఇంప్రెస్ అయి సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రావాల్సి ఉంది.

వాస్తవానికి మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కథ అసంపూర్తిగా ఉండడం, మహేష్ చిన్న చిన్న మార్పులు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టారని సమాచారం.. దీనితో లైన్ లోకి పరుశురాం సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీతో చేస్తారా లేదా అన్నది చూడాలి మరి!

Krishna

Krishna

Next Story