చిరకాల మిత్రుడికి స్టైలిష్ స్టార్ విషెస్!

చిరకాల మిత్రుడికి స్టైలిష్ స్టార్ విషెస్!
x

Allu Arjun, Maruthi

Highlights

Happy Birthday Maruthi : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టాడు..

Happy Birthday Maruthi : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టాడు.. ఇక గత ఏడాది డిసెంబర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అనే చిత్రాన్ని తెరకెకెక్కించి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు మారుతి..

ఇక ఇది ఇలా ఉంటే మారుతి నేడు 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు మారుతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మారుతికి శుభాకాంక్షలు తెలియజేశారు. `నా చిరకాల మిత్రుల్లో ఒకరు, నా శ్రేయోభిలాషి, డైరెక్టర్ మారుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని బన్నీ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ కాకముందు మారుతి బన్నీకి మంచి స్నేహితుడన్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం మారుతి హీరో గోపీచంద్ తో ఓ సినిమాని చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హీరో గోపిచంద్ ని కలిసి ఓ లైన్ వినిపించారట మారుతి.. ఈ లైన్ గోపిచంద్ కూడా బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఒకే చెప్పారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాని నిర్మిస్తోందిని తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం..


Show Full Article
Print Article
Next Story
More Stories