Gopi chand Next Movie with Maruthi: టాలీవుడ్ లో క్రేజీ కాంబో ఫిక్స్.. మారుతితో గోపిచంద్!

Gopi chand Next Movie with Maruthi: టాలీవుడ్ లో క్రేజీ కాంబో ఫిక్స్.. మారుతితో గోపిచంద్!
x
Gopi chand Next Movie with Maruthi
Highlights

Gopi chand Next Movie with Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్,

Gopi chand Next Movie with Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టాడు..ఇక గత ఏడాది డిసెంబర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అనే చిత్రాన్ని తెరకెకెక్కించి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు మారుతి.. ఆయితే మారుతి తర్వాత సినిమాకి హీరో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం దర్శకుడు మారుతి ఇటీవల హీరో గోపిచంద్ ని కలిసి ఓ లైన్ వినిపించారట.. ఈ లైన్ గోపిచంద్ కూడా బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఒకే చెప్పారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాని నిర్మిస్తోందిని తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం..

ఇక గత కొద్దికాలంగా గోపిచంద్ కూడా హిట్లు లేకా సతమతం అవుతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత గోపిచంద్ కి సరైనా హిట్ పడలేదు.. ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటిమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.' గౌతమ్ నంద' తరవాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. అంతేకాకుండా దర్శకుడు తేజ దర్శకత్వంలో కూడా ఓ సినిమాని చేస్తున్నాడు గోపిచంద్.

Show Full Article
Print Article
Next Story
More Stories