Allu Arjun Weight Loss for Pushpa Movie: 'పుష్ప' కోసం బరువు త‌గ్గిన బన్నీ!

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..

Krishna
Updated on: 26 July 2020 2:19 PM IST
Allu Arjun Weight Loss for Pushpa Movie: పుష్ప కోసం బరువు త‌గ్గిన బన్నీ!
X
Allu arjun ( File Photo)

Allu Arjun Weight Loss for Pushpa Movie: అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం..

అయితే ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బన్నీ బాగానే కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే పుష్పక్ నారాయణ పాత్ర కోసం గాను బన్నీ ఇప్పటికే ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గార‌ట. బరువు తగ్గడం కోసం అల్లు అర్జున్ ఇటీవల కేబీఆర్‌ పార్కులో రన్నింగ్‌ చేస్తూ ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో మళ్ళీ పట్టాలేక్కనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story