Allu Arjun to Play YS Jagan Biopic: సీఎం జగన్ పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్ ?

Arun Chilukuri
Updated on: 20 July 2020 11:55 AM IST
Allu Arjun to Play YS Jagan Biopic: సీఎం జగన్ పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్ ?
X

Allu Arjun to Play YS Jagan Biopic: స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ పొలిటిక్ పార్టీ పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నాడా. త్వరలో ప్రజా యాత్ర చేసేందుకు సన్నద్ధమవుతున్నాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ టాలీవుడ్ నిజమే అని సమాధానం చెబుతోంది. అల్లు అర్జున్ ఎంటి.? పొలిటిక్ ఎంట్రీ ఎంటి అనుకుంటున్నారా.. ఈ స్టోరీ చూస్తే అసలు సెక్రెట్ ఎంటో మీకే అర్థమవుతుంది.?

అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లిట్ అయ్యాక యాత్ర' ఫేం మహి వీ రాఘవ డైరెక్షన్ లో ఓ మూవీ చేసేందుకు సైన్ చేశాడు బన్నీ.. ఏపీ సీఎం జగన్ బయోపిక్ నే ఈ సినిమా కథగా మలుస్తున్నాడు డైరెక్టర్. అంటే అల్లుఅర్జున్ స్క్రీన్ పై జగన్ పాత్రలో కనిపించనున్నాడన్న మాట.

ఏపీ సీఎం జగన్ బయోపిక్ మూవీ చేద్దామా అని డైరెక్టర్ బన్నితో చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే దగ్గరి నుంచి సీఎంగా గెలిచే వరకు జరిగిన సంఘటనలను సన్నివేశాలుగా మలచనున్నారట. ఈ వార్త తెలియగానే ఇటు జగన్ అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story