Allari Naresh Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన అల్లరి న‌రేష్‌!

Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Krishna
Published on: 26 July 2020 12:59 PM IST
Allari Naresh Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన అల్లరి న‌రేష్‌!
X
Allari Naresh Accept Green India Challenge

Allari Naresh Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన అల్లరి నరేష్ ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. " ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఇందులో నేను కూడా పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు నరేష్.. ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటాలని, ఈ పనితో అయిన ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతామని నరేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక హీరో నాని, సింగర్ స్మిత, డైరెక్టర్ దేవా కట్టా లకి సవాల్ విసురుతున్నట్లు వెల్లడించారు అల్లరి నరేష్.



ఇక అల్లరి నరేష్ సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమాలో రవి అనే ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు.ప్రస్తుతం సోలో హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' అనే ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్..ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. శ్రీ చరణ్‌ పాకల సంగీతం అందిస్తున్నాడు. ఒక్క క్షణం సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Krishna

Krishna

Next Story