మా అమ్మ కోసమే ఆ పాటను తీశాను : ఎస్వీ కృష్ణారెడ్డి

S.V. Krishna Reddy Yamaleela : ఎస్వీ కృష్ణారెడ్డి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం, మావిచిగురు

Krishna
Published on: 24 Sept 2020 3:20 PM IST
మా అమ్మ కోసమే ఆ పాటను తీశాను : ఎస్వీ కృష్ణారెడ్డి
X

S. V. Krishna Reddy 

S.V. Krishna Reddy Yamaleela : ఎస్వీ కృష్ణారెడ్డి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం, మావిచిగురు మొదలగు చిత్రాలతో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. అయన చేసిన సినిమాలు దాదాపుగా హిట్ కాగా, మ్యూజిక్ పరంగా అన్ని బంపర్ హిట్ అయ్యాయి.. అయితే అయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ యమలీల చిత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి... అటు ప్రేక్షకులకి కూడా ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా కూడా యమలీలనే అనే చెప్పాలి.

అయితే గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న కృష్ణారెడ్డి తాజాగా ఓ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా యమలీల చిత్రం గురించి అయన మాట్లాడుతూ.. తన తల్లిని ద్రుష్టిలో పెట్టుకొనే ఆ సినిమాలో అమ్మ పాటను చిత్రీకరించినట్టుగా వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం చాలా మంది స్టార్ హీరోలు తనని సంప్రదించారని కానీ తానూ మాత్రం అలీని ఫిక్స్ అయినట్టుగా వెల్లడించారు. అయితే ఆ అవకాశం అలీనే తనకి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నానని అన్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీకి తానూ హీరో అవ్వాలని వచ్చినట్టుగా వెల్లడించారు. అందులో భాగంగానే జంధ్యాల, దాసరి నారాయణరావు లాంటి ఎంతో మంది దర్శకులను కలిసినట్టుగా వెల్లడించారు. అయితే అవకాశాలు రాకపోవడంతో డైరెక్టర్ గా మారానని వెల్లడించారు. ఇక దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఉగాది, ఊయల, అభిషేకం చిత్రలలో అయన హీరోగా నటించారు. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల 02 అనే ధారావాహికను చేస్తున్నారు.



Krishna

Krishna

Next Story