మహేష్ హీరోగా చేయాల్సిన సినిమా.. అలా ఆలీకి వెళ్లిందట!

మహేష్ హీరోగా చేయాల్సిన సినిమా.. అలా ఆలీకి వెళ్లిందట!
x
Mahesh Babu, Ali
Highlights

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అలీ.. ఆ తర్వాత హాస్యనటుడుగా మారి ఆ చాలా సినిమాల్లో నటించాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అలీ.. ఆ తర్వాత హాస్యనటుడుగా మారి ఆ చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా దాదాపుగా యాబైకి పైగా సినిమాల్లో నటించాడు. అలీ మొదటి సినిమాగా యమలీల విడుదలైంది. అయితే ఈ సినిమా కథని ముందుగా హీరో మహేష్ బాబు కోసం రాసుకున్నారట దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. కథను హీరో కృష్ణకి వినిపించాక కథ బాగుందని కృష్ణ చెప్పగా కానీ మహేష్ హీరోగా చేయడానికి ఇంకా ఐదేళ్ళు పడుతుందని, ప్రస్తుతం చదువుకుంటున్నాడు అని చెప్పారట కృష్ణ..

దీనితో ఈ సినిమాని హాస్యనటుడు అలీతో చేయాలనీ ఫిక్స్ అయ్యారట ఎస్వీ కృష్ణారెడ్డి.. కానీ సినిమా ఇండస్ట్రీలోని కొందరు అలీతో సినిమా ఏంటి మీ పతనం స్టార్ట్ అవుతుందని అన్నారట. ! కానీ కథ మీదా ఉన్న నమ్మకంతో అలీతో సినిమాని తెరకెక్కించారట దర్శకనిర్మాతలు.. అలా అలీ హీరోగా యమలీల తెరకెక్కింది. 1994లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

దర్శకుడిగా అంతకుముందు ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, నంబర్ వన్ సినిమాలు ఒకెత్తయితే యమలీల సినిమా మరో ఎత్తుగా నిలిచింది.. ఈ సినిమా చాలా ధియేటర్లలలో 175 రోజులు, హైదరాబాద్ లో 400 రోజులు ఆడి, అందరి ప్రశంసలు పొందింది..

ఈ సినిమాలో అలీకి జోడిగా ఇంద్రజ నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు నటించారు. ఈ సినిమాలోని "సిరులోలికించే చిన్ని నవ్వులే" అనే పాట ఇప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డినే సంగీతం అందించారు.

హీరోగా యమలీల మంచి హిట్టు అయినప్పటికీ అలీ మాత్రం మళ్ళీ కామెడీ పాత్రలు చేసుకుంటూనే వచ్చారు. దీనికి గల కారణం గురించి అలీ ఓ ఇంటర్వ్యూలో చెపుతూ అస‌లు సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావ‌డాన్ని అదృష్టంగా భావించాల‌ని అన్నారు. నేను కమెడియన్ గా రావడానికి చాలా కష్టపడ్డాను. కాబట్టి ఎలాంటి పాత్రలు వ‌చ్చిన చేయాల‌నుకున్నాన‌ని అలీ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories