HBD Megastar Chiranjeevi : చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల బర్త్ డే విషెస్!

HBD Megastar Chiranjeevi : చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల బర్త్ డే విషెస్!
x

chiranjeevi

Highlights

HBD Megastar Chiranjeevi : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన 65 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు..

HBD Megastar Chiranjeevi : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన 65 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా అభిమానులు, సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

* చిరంజీవి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు... మీరు మొత్తం జనరేషన్ కి ప్రేరణగా ఉన్నారు..అలాగే కొనసాగుతారు.. మీరు ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను : మహేష్ బాబు

* * చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. : మోహన్ బాబు


* పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య చిరంజీవి... నాకు చాలా మందికి మీరే ప్రేరణ.. : రవితేజ



* కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి చూస్తే చూడాలి మెగాస్టార్ సినిమా చూడాలి అని చిన్నప్పుడు అనుకునే నేను .ఇపుడు తీస్తే తీయాలిరా మెగాస్టార్ సినిమా తీయాలి అనిపిస్తుంది. ఎం జన్మ సార్ మీది సూపర్ : బండ్ల గణేష్


* చిరంజీవి గారు ఎ వెరీ హ్యాపీ బర్త్ డే. రాబోయే సంవత్సరాల్లో కూడా మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులను మీరు జరుపుకుంటారు : ఎన్టీఆర్


* నా లాంటి లక్షలాది మందికి మీరే ప్రేరణ. మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను .. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య : సునీల్




Show Full Article
Print Article
Next Story
More Stories