Megastar Chiranjeevi Birthday Common DP: మెగాస్టార్ కామన్ డీపీ లాంఛ్ చేసిన 'చిరు'త

Megastar Chiranjeevi Birthday Common DP: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కు పండగే.. మరికొన్ని గంటల్లోనే చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్ర‌తి ఏడాది త‌న అభిమానులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకునే సంబురమిది.

Karampoori Rajesh
Published on: 21 Aug 2020 8:49 PM IST
Megastar Chiranjeevi Birthday Common DP: మెగాస్టార్ కామన్ డీపీ లాంఛ్ చేసిన చిరుత
X

ram charan launched megastar chiranjeevi birthday dp in twitter

Megastar Chiranjeevi Birthday Common DP: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కు పండగే.. మరికొన్ని గంటల్లోనే చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్ర‌తి ఏడాది త‌న అభిమానులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకునే సంబురమిది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా సోషల్ మీడియాకే ప‌రిమితం చేశారు. ఆన్ లైన్ వేదిక‌గానే చిరుబర్త్ డేను వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే ఇప్పట్నుంచే సంబరాలు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో మెగాస్టార్ కామన్ డిపి ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంఛ్ చేసారు. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తండ్రికి మొదటి విషెస్ చెప్పాడు. ఇందులో చిరంజీవి ఐకానిక్ కారెక్టర్స్‌తో పాటు అదిరిపోయే ఫోటోలు కూడా ఉన్నాయి. మెట్లలా ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందులో చాలా అర్థం కూడా ఉంది. ఓ కొండను తొలచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సింహాసనంపై కూర్చున్నాడు చిరంజీవి. అంటే అతడి కష్టాన్ని ఆ ఫోటోలో చూపించారు. అదే విధంగా చిరు పుట్టిన రోజుకు అభిమానులు క్రియేట్ చేసిన ఓ వీడియోను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ కు అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

మొన్న మహేష్ బాబు బర్త్ డేకు ఏకంగా 6 కోట్ల మంది ట్వీట్స్ చేసారు. ఇప్పుడు చిరంజీవి బర్త్ డేను అంతకంటే గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అయ్యారంటా మెగా ఫ్యాన్స్. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పుట్టిన రోజుకు ఓ కొత్త సినిమాతో పాటు ఆచార్య అప్ డేట్స్ కూడా ఇవ్వనున్నాడు.



Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story