Surekha Vani: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి

Surekha Vani:నటీ సురేఖ వాణి రెండో వివాహంపై క్లారిటీ ఇచ్చారు.

Samba Siva Rao
Published on: 22 Feb 2021 4:00 AM IST
Surekaha vani clarity about his Second Marriage
X

సురేఖ వాణి ఫైల్ ఫోటో 

Tollywood Actress Surekha Vani: నటీ సురేఖ వాణి రెండో వివాహంపై క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుంటారని నెట్టింట్లో వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రముఖ గాయని సునీత రెండో వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే. అయితే సురేఖ కూడా ఆమె కూతురు సుప్రీత నిర్ణయం ప్రకారం మరోసారి పెళ్లికి ఒప్పుకున్నారని పలు చానళ్లలో, వెబ్ సైట్లలో వార్తలు దర్శనిమిచ్చాయి. ఈ క్రమంలో తన పెళ్లి వార్తలపై నటి సురేఖ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలేయాని సురేఖ వాణి కోరారు.

యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ వాణి తెలుగులో భద్ర, దుబాయ్‌ శీను, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో సురేఖవాణి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కాగా..గత కొన్ని రోజులుగా పెళ్లి గురించి వస్తున్న ప్రచారానికి తెరదించారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story