అందంలోనే కాదు.. బిజినెస్‌లోనూ మన హీరోయిన్లు తగ్గేదేలే.. ఎవరేం చేస్తున్నారంటే?

Tollywood Actress Side Business
x

అందంలోనే కాదు.. బిజినెస్‌లోనూ మన హీరోయిన్లు తగ్గేదేలే.. ఎవరేం చేస్తున్నారంటే?

Highlights

Actress Side Business: డబ్బు సంపాదించడం ఒక ఎత్తు. ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేసి రెట్టింపు చేయడం మరో ఎత్తు.

Actress Side Business: డబ్బు సంపాదించడం ఒక ఎత్తు. ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేసి రెట్టింపు చేయడం మరో ఎత్తు. ఈ విషయం తెలియక చాలామంది నటీనటులు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటిస్తూనే వచ్చిన డబ్బును ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ మనీ మేనేజ్ మెంట్ లో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు వంటి వెటరన్ హీరోలే కాకుండా నేటితరం హీరోలు మహేష్ బాబు, రాంచరణ్, అల్లుఅర్జున్ ఇంకా పలువురు హీరోలు రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, క్లాత్ బ్రాండ్స్, జువెలరీ బ్రాండ్స్ ఇలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ మెన్లుగా కూడా సత్తా చాటుకుంటున్నారు. మన హీరోలే కాదు టాలీవుడ్ బ్యూటీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. మరి, సైడ్ బిజినెస్ లు చేస్తున్న కొంతమంది హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కాజల్ అగర్వాల్:

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుస సినిమాలు దక్కించుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీ చిత్ర సీమలో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం గ్లామర్ రేసు నుంచి తప్పుకున్న కాజల్ అగర్వాల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి మర్సాలా అనే ఆభరణాల కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ బిజినెస్ ను కాజల్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.

ప్రణీత:

ఇక ప్రణీత సుభాష్ తెలుసు కదా..సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ కన్నడ కస్తూరి..ఫుడ్ బిజినెస్ లో పుష్కలంగా సంపాదిస్తోంది. బెంగళూరులో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన ప్రణీత ఇది సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడంతో చెన్నై, హైదరాబాద్ లో తన రెస్టారెంట్ బ్రాంచ్ లను ఏర్పాటు చేసేందుకు రెడీ ఔతోంది.

రకుల్ ప్రీత్ సింగ్:

తెలుగులో సత్తా చాటి..టాప్ హీరోలందరితో ఆడిపాడిన రబ్బర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఈ బ్యూటీకి ఫిట్ నెస్ పై ఎంత మోజో మనకు తెలిసిందే కదా..ఆ మోజుతోనే అన్ని మెట్రో సిటీస్ లో జిమ్ సెంటర్లను ఓపెన్ చేసింది. పలువురు సెలబ్రిటీలకు ఈ జిమ్ సెంటర్లే కేరాఫ్ అడ్రస్.

తమన్నా:

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సైతం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మాటలను అమలు చేసేస్తోంది. సినిమాల్లో వరుస అవకాశాలు లభిస్తున్న తరుణంలోనే ఈ భాటియా బొమ్మ వైట్ అండ్ గోల్డ్ పేరుతో సొంత ఆభరణాల సంస్థను స్థాపించింది. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇలియానా:

ఇక జీరో సైజ్ బ్యూటీ ఇలియానా కూడా తక్కువేం కాదు. బాలీవుడ్ లో పాగా వేయాలని టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా ముంబై చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ అంతగా కలిసి రాకపోవడంతో ఉన్న డబ్బును వేస్ట్ చేయకుండా చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం బిజినెస్ వుమెన్ గా లైఫ్ ని లీడ్ చేస్తోంది. టూరిస్ట్ డెస్టినేషన్ గోవాలో ఇలియానాకు చైన్ రెస్టారెంట్లు, బేకరీలు ఉన్నాయి.

శృతిహాసన్:

గబ్బర్ గాళ్ శృతిహాసన్ కూడా తన అభిరుచికి తగ్గట్టు సినీఇండస్ట్రీలోనే పెట్టుబడులు పెట్టింది. ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్ ఫిలిమ్స్, వీడియో రికార్డింగ్ సంస్థను శృతి స్థాపించింది. అలాగే తాప్సీ పన్ను సైతం తన సిస్టర్ షాగన్, ఫ్రెండ్ ఫరాహ్హ్ తో కలిసి వెడ్డింగ్ ప్లానర్ గా రాణిస్తోంది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరిట సంస్థను ఏర్పాటు చేసి పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లను చాలా గ్రాండ్ గా చేసింది.

శ్రియాశరన్:

ఇక ఢిల్లీ డాల్ శ్రియాశరన్ సైతం బిజినెస్ రంగంలో తనదైన మార్క్ తో దూసుకుపోతోంది. 20 ఏళ్ల పాటు గ్లామర్ ఫీల్డ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యూటీ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. ఈ వాజీవాజీ సుందరి మల్టిపుల్ బిజినెస్ లు చేస్తోంది. అయితే వీటిలో శ్రీ స్పందన స్పా మెయిన్. ఇండియాలో ఉన్న ప్రముఖ స్పా కంపెనీల్లో శ్రీ స్పందన ఒకటి.

కీర్తి సురేష్:

అలాగే నేటితరం మహానటి కీర్తి సురేష్ కూడా వ్యాపారరంగంలో అడుగుపెట్టేసింది. ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలమే అయినా..తన గ్లామర్ ఇన్నింగ్స్ కి ఢోకా లేకపోయినా అప్పుడే బిజినెస్ మొదలు పెట్టేసింది. భూమిత్ర పేరుతో సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని కీర్తి సురేష్ లాంఛ్ చేసింది. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన ఔషధాలతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేసి కీర్తి సురేష్ మార్కెట్ లోకి వదులుతోంది. ఇక దక్షిణాది భాషా చిత్రాల్లో రాణిస్తున్న హర్షికా పునాచ కూడా ఓ వైపు గ్లామర్ ప్రపంచంలో రాణిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. తన బంధువులతో కలిసి గ్లామ్ గోల్డ్ ఫ్యాషన్ అండ్ ఈవెంట్ అనే ఫ్యాషన్ సంస్థను ప్రారంభించింది.

మొత్తానికి, కొంతమంది పాతతరం నటీనటుల మాదిరి కాకుండా నేటితరం హీరోహీరోయిన్లు మనీ మేనేజ్ మెంట్ విషయంలో క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories