Actor NagaBabu Comedy Show: అప్ కమింగ్ కమెడియన్స్ కోసం..నాగబాబు గోల్డెన్ ఛాన్స్ !

Actor NagaBabu Comedy show: మీలో నవ్వించే దమ్ముందా అయితే అప్ కమింగ్ కమెడియన్స్ కోసం అదిరిపోయే అవకాశం ఇస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు..

Krishna
Published on: 15 July 2020 1:07 PM IST
Actor NagaBabu Comedy Show: అప్ కమింగ్ కమెడియన్స్ కోసం..నాగబాబు గోల్డెన్ ఛాన్స్ !
X
nagababu

Actor NagaBabu Comedy Show: మీలో నవ్వించే దమ్ముందా అయితే అప్ కమింగ్ కమెడియన్స్ కోసం అదిరిపోయే అవకాశం ఇస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు.. త్వరలో ఆయన రెండు షో లను మొదలు పెట్టనున్నట్లుగా తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడదల చేశారు నాగబాబు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారు..

ఈ వీడియోలో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.."

అదిరింది, జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో అవకాశం దక్కలేదు అని బాధపడుతున్నారా..అయితే మీకోసమే

ఈ ఛాలెంజ్ విసురుతున్నాను.. నాలాంటి వాళ్లను నవ్వించగలిగే సత్తా ఉంటే ఈ ఆఫర్ మీకోసమే అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు..మేం రెండు రకాల షోస్ చేస్తున్నాం.. అందులో ఒకటి.. జబర్దస్త్, అదిరింది లాంటి షో.. అందరూ..జబర్దస్త్, అదిరింది లాంటి షోలలో ఛాన్స్ లు రాకపోవచ్చు.. యూట్యూబ్‌లో కూడా చాలా మంది మంచి మంచి స్కిట్‌లు చేస్తున్నారు. అలాంటి స్కిట్స్ మీరు చేయొచ్చు.

ఇక రెండోది.. స్టాండప్ కామెడీ కాంపిటేషన్.. ఇది , తమిళ, కన్నడలో కూడా చాలామంది స్టాండప్ కమెడియన్స్ ఉన్నారు. కానీ తెలుగులో ఇలాంటిది లేదు..అయితే దానిని తెలుగులో పెట్టాలని అనుకుంటున్నాం.. త్వరలో మన ఛానల్ మన ఇష్టంలో ఈ అప్డేట్ లను ఇస్తాం.. ఇందులో ఏం చేయాలి.. ఎలా చేయాలి అనేది వాళ్లు అనౌన్స్మెంట్ ఇస్తారు.

నిజంగా మీరు ఈ పోటీలో పాల్గొని విజేతలైతే మీకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. దానికి ముందు మీరు ఈ పోటీలో పాల్గొనాలి. దీనికి ఎంట్రీ ఫీజు ఏమీ లేదని, మీరు ఈ కాంపిటేషన్లో పాల్గొని మీ సత్తా చూపించండి. ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అంటూ నాగబాబు పేర్కొన్నారు..

Krishna

Krishna

Next Story