logo

హాలీవుడ్ లో నటించనున్న 'అర్జున్ రెడ్డి' నటుడు

హాలీవుడ్ లో నటించనున్న
Highlights

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కొద్ది రోజుల్లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన వారిలో రాహుల్ రామకృష్ణ ఒకడు....

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కొద్ది రోజుల్లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన వారిలో రాహుల్ రామకృష్ణ ఒకడు. 'అర్జున్ రెడ్డి' సినిమా తో పాపులర్ అయిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇప్పటి దాకా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో తన సత్తా చాటనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫాన్స్ కు తెలియజేశాడు. రాహుల్ రామకృష్ణ ఒక వెబ్ సిరీస్ టీవీ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. "ఇంత త్వరగా బయటకు వస్తుందనుకోలేదు. నా ప్రాజెక్ట్ కు సంబంధించి ఇది ఒక చిన్న స్నీక్ పీక్. ఇంత కష్టపడినందుకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశాడు రాహుల్. ఇక త్వరలో విడుదల కానున్న 'మిఠాయి' సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతోంది.


లైవ్ టీవి


Share it
Top