Balakrishna Once again Shows his Kindness: మరోసారి మంచి మనసు చాటుకున్న హీరో బాలకృష్ణ

Balakrishna Once again Shows his Kindness: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా

Krishna
Published on: 25 July 2020 10:02 PM IST
Balakrishna Once again Shows his Kindness:  మరోసారి మంచి మనసు చాటుకున్న హీరో బాలకృష్ణ
X
Balakrishna, vv vinayak (File Photo)

Balakrishna Once again Shows his Kindness: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా చాలా మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న బాలకృష్ణ తాజాగా సినీ పరిశ్రమకు 24 విభాగాల వారికి కరోనా నుంచి రక్షించుకునేందుకు మందులు పంపారు. ఈ విషయాన్ని దర్శకుడు వి.వి.వినాయక్‌ అభిమానులకు వెల్లడించారు.

ఈ సందర్భంగా వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని చోట్ల విస్తరిస్తుంది.. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బసవతారకం ఆస్పత్రి ద్వారా హోమియో మాత్రలు, విటమిన్‌ ట్యాబెట్లను బాలకృష్ణ నాకు పంపారు. కేవలం నా ఒక్కడికి మాత్రమే కాదు. సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ మందులు పంపిన బాలకృష్ణకు ధన్యవాదాలు'' అంటూ ఈ సందర్భంగా వి.వి.వినాయక్‌ తెలిపారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం.. ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కరోనాతో వలన వాయిదా పడిన ఈ చిత్రం త్వరలో మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Krishna

Krishna

Next Story