Balakrishna letter to CM Jagna: సీఎం జగన్ కి రెండు లేఖలు రాసిన బాలకృష్ణ!

Balakrishna letter to CM Jagna: సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు లేఖలు రాశారు. ఈ లేఖలను ఫ్యాక్స్ ద్వారా బాలకృష్ణ సీఎం కార్యాలయానికి పంపించారు

Krishna
Published on: 13 July 2020 9:34 PM IST
Balakrishna letter to CM Jagna: సీఎం జగన్ కి రెండు లేఖలు రాసిన బాలకృష్ణ!
X
Balakrishna write letter to Jagan

Balakrishna letter to CM Jagna: సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు లేఖలు రాశారు. ఈ లేఖలను ఫ్యాక్స్ ద్వారా బాలకృష్ణ సీఎం కార్యాలయానికి పంపించారు. ఈ లేఖలో బాలకృష్ణ జిల్లాల పునర్విభజనపై పేర్కొన్నారు. ఒకవేళ జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ అయన సీఎం జగన్ కోరారు. ఇక మరో లేఖలో బాలకృష్ణ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో ఆ కాలేజీని హిందూపూర్ సమీపంలో మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలనీ కోరారు.

ఇక గత కొద్దిరోజులుగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. ఇందులో రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు, కోస్తాలో ఆరు జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ 13 జిల్లాలను త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీనిపైన నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక ఎన్నికల ముందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలోని కొత్త జిల్లాల లిస్టులో హిందూపురం కూడా ఉండడంతో సీఎం జగన్ కి బాలయ్య ఈ లేఖలు రాశారు. ఈ లేఖలను సీఎం జగన్ తో పాటు సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి కూడా పంపించారు బాలకృష్ణ.




Krishna

Krishna

Next Story