బన్నీ గ్రేట్ రికార్డ్.. సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్

బన్నీ గ్రేట్ రికార్డ్.. సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్
x
Allu Arjun (File Photo)
Highlights

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాది సినీపరిశ్రమలోనే మంచి ఇమేజ్ సాధించాడు.

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాది సినీపరిశ్రమలోనే మంచి ఇమేజ్ సాధించాడు. బన్నీకి తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. మలయాళంలో ఇప్పటికే బన్నీకి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ సినిమాలకు గుర్తింపు ఉంది. దానికితోడు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అర్జున్ అల వైకుంఠపురములో.. చిత్రం కూడా హిందీలో రీమేక్ కాబోతుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన రేంజ్ ఏంటో చూపించుకున్నాడు.

ఇక నాన్ బాహుబలి సినిమాల్లోనే అల వైకుంఠపురములో.. 150 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బన్నీకి తిరుగులేదు. అల్లు అర్జున్ ఫేస్ బుక్‌లో ఇప్పుడు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు దక్షిణాదిలో ఏ హీరోకు సాధ్యం కాని సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో ఏకంగా 13 మిలియన్ లైక్స్ అందుకున్నాడు. అంటే కోటి 30 లక్షల లైక్స్ అని అర్ధం. సౌత్ లో ఫేస్ బుక్ ఫాలోయింగ్ ఉన్న నటుడు బన్నీ మాత్రమే కావడం విశేషం.

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా రప్ఫాడిస్తున్నాడు. ఈ ఏడాది సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో తనకు తానే సాటి అంటూ ముందుకు కదులుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories